ప్లాస్టిక్‌ నివారణకు మెట్‌పల్లిలో వినూత్న స్టీల్ బ్యాంక్ ప్రారంభం

రిపోర్టర్: రాజేష్ స్థలం: జగిత్యాల

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో పర్యావరణ పరిరక్షణ కోసం 16వ వార్డు కౌన్సిలర్ దంపతులు వనజ-మురళి స్టీల్ బ్యాంక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వార్డులో జరిగే శుభకార్యాలలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వాడకుండా స్టీల్ పాత్రలను ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో చేపట్టిన ఈ స్పూర్తిదాయక కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.