ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుని రెండేళ్ల చిన్నారి దుర్మరణం
రిపోర్టర్: మహేష్
స్థలం: ఖమ్మం
ఖమ్మం నగరంలో గణేశ్ శోభాయాత్ర ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకోవడంతో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రెండేళ్ల బాలుడు వైభవ్ నాయక్ మృతిచెందాడు. అంబులెన్స్ ముందుకు కదలకపోవడంతో తండ్రి భూక్యా సైదులు కుమారుడిని భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రికి పరుగులు తీసినా ఫలితం లేకపోయింది. సకాలంలో వైద్యం అందక చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.