గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని వివిధ నిమజ్జన కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సంగెం చెరువు, తుమ్మలగూడెం చెరువు, రామన్నపేట మరియు వలిగొండ చెరువుల వద్ద నిమజ్జనానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడింగ్, విద్యుత్ సరఫరా, లైటింగ్, పారిశుద్ధ్యం, క్రేన్ల ఏర్పాటు మరియు పోలీసు బందోబస్తు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.