కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీమలయప్పస్వామివారు

రిపోర్టర్: నరేష్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ అంగరంగ వైభవంగా సాగిన దివ్య వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.