అగ్రిగోల్డ్ సహా ఆర్థిక సంస్థల కేసుల విచారణకు విజయవాడలో ప్రత్యేక కోర్టు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద నమోదైన కేసులతో పాటు అగ్రిగోల్డ్ కేసులను విచారించేందుకు విజయవాడ కేంద్రంగా ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమోదంతో న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రత్యేక కోర్టుకు రాష్ట్రవ్యాప్త విచారణాధికార పరిధిని కల్పిస్తూ జిల్లా జడ్జి కేడర్ పోస్టుతో పాటు మొత్తం 21 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది.