సచివాలయంలో తీవ్ర తాగునీటి సమస్య: ఉద్యోగుల ఇబ్బందులపై యంత్రాంగం నిర్లక్ష్యం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ సచివాలయంలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిబ్బంది వెల్లడించారు. బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఏజెన్సీలు నీటి సరఫరాను ఆపేశాయని, దీంతో సిబ్బంది ఇళ్ల నుంచి బాటిళ్లు తెచ్చుకుంటున్నారని తెలిపారు. కనీస సదువు కల్పించడంలో యంత్రాంగం విఫలమవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోందని, బకాయిలు చెల్లించి వెంటనే సరఫరా పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.