ఎంఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న నటన.

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

భారతరత్న ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న బయోపిక్‌లో రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 16న సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ పాత్ర కోసం రష్మిక ప్రత్యేకంగా సంగీత శిక్షణ తీసుకోనున్నారు. పలు భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.