వరంగల్లో దసరా, బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లపై మాజీ మంత్రి కొండా సురేఖ సమీక్ష
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: వరంగల్
వరంగల్ రంగీల మైదానం, ఉర్సు గుట్ట, కరీమాబాద్ ప్రాంతాలలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలు, రావణ వధ కార్యక్రమం మరియు సద్దుల బతుకమ్మ పండగ ఏర్పాట్లపై మాజీ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఉత్సవాలు జరిగే స్థలాలను పరిశీలించి, పండగ వేడుకలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.