'మారుపేర్ల కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారం': సింగరేణి కార్మికుల సంక్షేమమే మాధ్యేయం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

సింగరేణిలో 1997 నుంచి పెండింగ్‌లో ఉన్న 128 మంది 'మారుపేర్ల' కార్మికుల సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. ఈ సమస్యపై ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని నియమించామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సింగరేణి కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పునరుద్ఘాటించింది.