అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు: ఉత్సాహంగా ఆడిపాడిన చిన్నారులు

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ మూడు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా ఆడి పాడారు. అనంతరం అంగన్వాడీ టీచర్ ఎన్. పద్మ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అన్నారు. పండుగల విశిష్టత భావితరాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్ ఎన్. పద్మ, హెల్పర్ లత, పిల్లలు పాల్గొన్నారు.