ఎల్ నినో సవాళ్ల ఎదుర్కొనేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు: బాధ్యతలు భట్టికి

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావాలను సమర్థవంతంగా అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలో ఈ సబ్కమిటీ బాధ్యతలను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అప్పగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాతావరణ మార్పులను నిరంతరం సమీక్షించి రైతులకు, ప్రజలకు తగిన ముందస్తు సూచనలు అందించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.