టిడ్కో ఇళ్లపై మంత్రి నారాయణ ఫైర్: మార్చి నాటికి అన్ని పూర్తి

రిపోర్టర్: వెంకట్ స్థలం: నెల్లూరు

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారాయణ వెల్లడించారు. సోమవారం నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం ఏడు లక్షల ఇళ్లను రెండు లక్షల అరవై ఒక్క వేలకు కుదించిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన పనుల కోసం అదనంగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని స్పష్టం చేశారు.