తమిళనాడులో ఆరు కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Tamil Nadu
తమిళనాడులో వైద్య విద్యను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నామక్కల్, తిరుచిరాపల్లి, ధర్మపురి, వెల్లూరు, తిరుణ్ణామలై, తిరునెల్వేలి జిల్లాలతో పాటు కోయంబత్తూరులో కొత్తగా ఏడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కళాశాలల ద్వారా అదనంగా 660 బిఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని, దీనికోసం రూ.270.26 కోట్ల నిధులను కేటాయించినట్లు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.