మౌలిక వసతులు కరవై అల్లాడుతున్న బెల్లంపల్లి ఆరో వార్డు దుస్థితి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఆరో వార్డు అభివృద్ధికి నోచుకోకపోవడంపై కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, వీధిలైట్లు కరవై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, కలెక్టర్ స్పందించి తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.