కర్నూలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు తొంబై రెండు ఫిర్యాదులు
రిపోర్టర్: సతీష్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 92 ఫిర్యాదులు అందాయి. ప్రజల సమస్యలపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా పూర్తి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బాధితులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను నేరుగా ఎస్పీకి వివరిస్తూ వినతిపత్రాలు అందజేశారు.