జీకేవీధిలో విద్యార్థులకు మహిళా భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో త్రిశూల్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు ఎస్ఐ కే సురేష్ విద్యార్థులకు మహిళా భద్రత, రోడ్డు భద్రత మరియు గంజాయి నిర్మూలనపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.