టెక్కలి రావివలస వద్ద రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

రిపోర్టర్: నరేష్ స్థలం: శ్రీకాకుళం జిల్లా, టెక్కలి

శ్రీకాకుళం జిల్లా టెక్కలి రావివలస వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రైలు ప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులను ఆరా తీశారు. పరిస్థితిని సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు.