పూతలపట్టు మండలం రామాపురంలో వైభవంగా వినాయక స్వామి నిమజ్జనోత్సవం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పూతలపట్టు

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బి.రామాపురం గ్రామంలో వినాయక స్వామి నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గణనాథుని నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక లడ్డూ వేలం పాటలో గ్రామానికి చెందిన పాటూరు వెంకటేష్ పదమూడు వేల ఐదు వందల ఒక్క రూపాయికి లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం శోభాయాత్రగా తరలివెళ్లి గణనాథుడి విగ్రహాన్ని జలాల్లో నిమజ్జనం చేశారు. గ్రామానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేసి వేడుకలను విజయవంతం చేశారు.