కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై రేవంత్ సర్కార్ కు కేటీఆర్ సవాల్
రిపోర్టర్: హరి
స్థలం: Adilabad
కాంగ్రెస్ పాలనలో మోసపోయిన రైతులకు బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉత్తర తెలంగాణలో రణభేరి మోగించనున్నారు. నేడు ఆదిలాబాద్ పర్యటనతో ప్రారంభం కానున్న ఈ రైతు గర్జన సదస్సుల్ లో రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. పంట నష్టంతో అల్లాడుతున్న బాధిత రైతు కుటుంబాలను పరామర్శించి, వారికి పార్టీ తరఫున పూర్తి భరోసా కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు.