నర్సంపేట జనసేన కోఆర్డినేటర్లుగా మదిరెడ్డి దామోదర్ రెడ్డి మరియు దాసరి పవన్ నియామకం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా రాష్ట్ర నాయకులు మదిరెడ్డి దామోదర్ రెడ్డి, దాసరి పవన్‌లను నియమించింది. పార్టీ సంస్థాగత బలోపేతం, పట్టభద్ర ఓటర్ల అనుసంధానం, ఓటరు నమోదు మరియు రాబోయే ఎన్నికల నిర్వహణ బాధ్యతలను వారు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు బరిలో నిలవనున్న విషయం విదితమే.