విద్యార్థులకు భారీ షాక్: రెండు పరీక్షలను విలీనం చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నెట్ పరీక్షతో విలీనం చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 2026 సెషన్ నుంచి లైఫ్ సైన్సెస్ అండ్ బయోటెక్నాలజీ పేరుతో కొత్తగా కంబైన్డ్ డిసిప్లిన్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఈ కొత్త విధానం ద్వారా ఫెలోషిప్‌ల కేటాయింపు ప్రక్రియ మరింత మారుతుందని, అభ్యర్థులు సవరించిన సిలబస్‌ను పరిశీలించి ప్రిపరేషన్ సాగించాలని అధికారులు సూచించారు.