అంతరిక్షంలో తొలిసారిగా అమెరికా స్పేస్ ఆయుధం మోహరింపు!
రిపోర్టర్: రాము
స్థలం: World
అంతరిక్షంలో సైనిక ఆధిపత్యం సాధించే దిశగా అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. భూమి కక్ష్యలో ప్రయోగించిన తొలి అఫెన్సివ్ స్పేస్ ఆయుధాన్ని అధికారికంగా ధృవీకరించింది. రష్యా, చైనా దేశాల నుండి పెరుగుతున్న ముప్పును తిప్పికొట్టేందుకు, కీలక ఉపగ్రహాలను కాపాడుకునేందుకు గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థలో భాగంగా ఈ ఆన్-ఆర్బిట్ ఆయుధాన్ని మోహరించినట్లు అమెరికా స్పేస్ ఫోర్స్ ప్రకటించింది.