గల్ఫ్ సంక్షోభంపై ప్రతిపక్షాల కుట్ర: నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: మహేష్ స్థలం: బనస్కాంత

గల్ఫ్ దేశాల్లోని ఉద్రిక్తతల నేపథ్యంలో ఎరువులు, గ్యాస్ కొరతపై ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంతలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడమే వారి ప్రధాన లక్ష్యమని ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ భారాన్ని ఎన్నడూ రైతులపై పడకుండా సంరక్షించిందని స్పష్టం చేశారు.