కృత్రిమ సూర్య ప్రాజెక్ట్‌లో భారత్ మరో చారిత్రాత్మక మైలురాయి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: గుజరాత్
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఎస్ఎస్టీ-1 టోకమాక్ పరికరంలో శక్తివంతమైన 82.6 గిగాహెర్ట్జ్ గైరోట్రోన్ వ్యవస్థను విజయవంతంగా అమర్చారు. సూర్యుడిలో జరిగే కేంద్రక సంలీన ప్రక్రియను భూమిపై పునఃసృష్టించి, కృత్రిమ సూర్యుడిని తయారు చేసే దిశగా భారత్ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. భవిష్యత్తులో నిరంతర క్లీన్ ఎనర్జీ సాధించడానికి ఈ ప్రయోగం అత్యంత కీలకం కానుంది.