తెలంగాణలో కాలం తెచ్చిన కరవు కాదు: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర నిప్పులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరైన నీటి యాజమాన్యం లేకపోవడం వల్లే పంట పొలాలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. ఎండిపోయిన పంటలకు తక్షణమే ఎకరాకు ఇరవై వేల రూపాయల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలపై రుద్దుతున్న కరవు అని కేటీఆర్ విమర్శించారు.