టాలీవుడ్లో తీవ్ర విషాదం దర్శకుడు ప్రదీప్ అద్వైతం భార్య మృతి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుందని, దర్శకుడు ప్రదీప్ అద్వైతం భార్య దీప్తి రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆమె, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భార్య అకస్మాత్తు మరణంతో ప్రదీప్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దిగ్భ్రాంతికర వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ప్రదీప్కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.