క్యాప్టెన్ స్మిత్ ధైర్యసాహసాలను ప్రశంసించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీకాకుళం
భారీ విపత్తును సమయస్ఫూర్తితో అడ్డుకున్న క్యాప్టెన్ స్మిత్ ధైర్యసాహసాలు అద్భుతమని, ఆయన దేశం గర్వించదగ్గ రీతిలో వ్యవహరించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మరియు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. విమాన ప్రయాణంలో ఎదురైన క్లిష్టమైన పరిస్థితులను ఆయన తన అప్రమత్తతతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. దేశ ప్రజలందరూ ఆయన చూపిన సాహసానికి గర్విస్తున్నారని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొంటూ ప్రత్యేక అభినందనలు తెలిపారు.