గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి మంత్రి సీతక్క
రిపోర్టర్: గోపి
స్థలం: ములుగు
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవురావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంపై ప్రజలలో అవగాహన కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు. సైడ్ ఎఫెక్ట్ లేని ఆయుర్వేద మందులు అన్ని రోగాలకు అద్భుతంగా పనిచేస్తాయని, దీర్ఘకాలిక వ్యాధులను కూడా వీటితో నయం చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ విభాగానికి ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని, ఏటూరునాగారం ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించామని వెల్లడించారు.