అక్టోబర్ రెండున తెలుగు ప్రేక్షకు ముందుకు వస్తున్న ప్రేమనే ఊరిలో చిత్రం

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమనే ఊరిలో సినిమా అక్టోబర్ రెండవ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలిపారు. కన్నడలో సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదలైన ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించిందని, కర్ణాటకలో హౌస్ ఫుల్ అవుతున్న ఈ ప్రేమ కథా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా అదేవిధంగా ఆదరిస్తారని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. శ్రీరామ్, రమిక శివు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సునద్ గౌతమ్ సంగీతం అందించారు.