నర్సంపేటలో పశువుల సంచారం: హెచ్చరికలకే పరిమితమైన మున్సిపల్ అధికారుల తీరుపై నిలదీత

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట పట్టణంలో పశువులను రోడ్లపై వదిలితే రూ.5 వేల జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. మేకలు, గొర్రెలు రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా కఠినంగా జరిమానాలు విధిస్తేనే పరిస్థితి మారుతుందని పట్టణవాసులు కోరుతున్నారు.