తెలుగు రాష్ట్రాల్లో వరుసగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయని ఆర్థిక నిపుణులు తెలిపారు. దసరా, దీపావళి పండుగల వేళ పసిడి ధరలు కొంతమేర దిగిరావడంతో కొనుగోలుదారులు, మహిళలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ బంగారం ధరలు ఒకే విధంగా నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ఒడిదుడుకులు మరియు రూపాయి మారకం విలువ ఆధారంగా ధరలు మారుతుంటాయని నిపుణులు స్పష్టం చేశారు.