తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన: బాధితులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మెట్రేవు పునరావాస కేంద్రంలో తుపాను ప్రభావిత బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. పునరావాస కేంద్రంలో వసతులు, సౌకర్యాలపై సీఎం ఆరా తీశారు. తుపాను అనంతరం నష్టాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు.