బిట్స్ పిలానీ సంచలన నిర్ణయం: వంద శాతం ట్యూషన్ ఫీజు రాయితీ పెంపు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Pilani

బిట్స్ పిలానీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు స్కాలర్షిప్ పరిధిని గణనీయంగా పెంచినట్లు గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. రాంగోపాల్ రావు వెల్లడించారు. బిట్సాట్ ప్రవేశ పరీక్షలో టాప్ 500 ర్యాంకుల నుంచి ఇప్పుడు 1000 ర్యాంకుల వరకు అర్హత కల్పించామని ఆయన తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కుటుంబ వార్షిక ఆదాయం ఇరవై లక్షల రూపాయల లోపు ఉన్న విద్యార్థులకు ఈ పూర్తి ఫీజు రాయితీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.