ఉన్మాదులపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు: నడిబజార్ లో ఎన్కౌంటర్ చేసినా తప్పులేదని ఫైర్
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
మహిళలపై అరాచకాలకు పాల్పడే హేయమైన నేరస్థుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అలాంటి ఉన్మాదులను నడిబజార్ లో ఎన్కౌంటర్ చేసినా తప్పులేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం చట్టపరమైన శిక్షలతో పాటు సమాజంలో తీవ్ర భయం పుట్టించేలా కఠినమైన చర్యలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరఫున కఠినమైన నిబంధనలు అమలు చేస్తామని, బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.