వ్యాపార రంగంలో భారత్ దూసుకుపోతోందంటూ బీజేపీ ప్రకటన
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
అవకాశాల నుంచి పెట్టుబడుల వరకు భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. వ్యాపార వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థానంలో భారత్ నిలిచిందని, గత నాలుగేళ్లుగా గ్లోబల్ టాప్ త్రీలో కొనసాగుతోందని తెలిపింది. ఇక్కడ వ్యాపారాలు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు మరింతగా ముందుకు వస్తున్నారని, రానున్న పన్నెండు నెలల్లో పెట్టుబడులు పెంచేందుకు వ్యాపార వేత్తలు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించింది.