టెక్ వార్నింగ్: ఏఐ చాట్బాట్లలో పొరపాటున కూడా ఈ వివరాలు పంచుకోవద్దు
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
ఏఐ చాట్బాట్లను వినియోగించే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాస్వర్డ్లు, బ్యాంకింగ్ పిన్ నంబర్లు, ఆధార్ కార్డులు, కంపెనీ రహస్య పత్రాలు వంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని చాట్బాట్లలో ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యం వల్ల వ్యక్తిగత భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, ప్రైవసీని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించాలని టెక్ నిపుణులు సూచించారు.