ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు సెప్టెంబర్ 14 వరకు పొడిగింపు
రిపోర్టర్: నరేష్
స్థలం: భారతదేశం
దేశీయ వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఎల్పీజీ ఈ-కేవైసీ పూర్తి చేసే గడువును సెప్టెంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు మొబైల్ ఫోన్ ద్వారా ఉచితంగా లేదా గ్యాస్ ఏజెన్సీలను నేరుగా సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని సూచించింది.