నర్సు అత్యాచారం, హత్య కేసులో నిందితుడి డిఎన్ఏ నిర్ధారణ

రిపోర్టర్: శివ స్థలం: రంగారెడ్డి

హైదరాబాద్ తుక్కుగూడలో నర్సు అత్యాచారం మరియు హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అరెస్టయిన నిందితుడు మహ్మద్ సనాఉల్లా డిఎన్ఏ నమూనాలు బాధితురాలి నమూనాలతో సరిపోలినట్లు తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిర్ధారించింది. ఈ శాస్త్రీయ ఆధారాలు పోలీసు దర్యాప్తునకు మరింత బలం చేకూర్చాయి.