ఘోర విమాన ప్రమాదం: అమెరికాలో కూలిపోయిన జెట్, తొమ్మిది మంది దుర్మరణం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఫ్లోరిడా

అమెరికాలోని ఫ్లోరిడాలో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని యూఎస్ రవాణా కార్యదర్శి సీన్ డఫీ తెలిపారు. బహామాస్ వెళ్తున్న లీయర్ జెట్ 60 విమానం గ్రీన్ అక్రెస్ ప్రాంతంలో కూలిపోయిందని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో వాతావరణం క్షీణించడం, విమానంపై మంచు పేరుకుపోవడం వల్ల ఈ పెను విషాదం చోటుచేసుకుందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డులు వెల్లడిస్తున్నాయి.