మాచర్ల ఎత్తిపోతల జలపాతంలో సరికొత్త సాహస క్రీడలు ప్రారంభం

రిపోర్టర్: కిరణ్ స్థలం: పల్నాడు జిల్లా

పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ప్రసిద్ధ ఎత్తిపోతల జలపాతం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది. రూ.1.71 కోట్ల వ్యయంతో 1,000 మీటర్ల జిప్‌లైన్, స్కై సైక్లింగ్, పిల్లల కోసం ప్రత్యేక ఫన్‌ జోన్‌లను ఏర్పాటు చేశారు. పర్యాటక అభివృద్ధి సంస్థ సహకారంతో అందుబాటులోకి తెచ్చిన ఈ సాహస క్రీడలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రకృతి అందాల నడుమ ఈ థ్రిల్లింగ్ రైడ్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.