నాగర్ కర్నూల్ జిల్లాలో ఉచిత వేరుశెనగ విత్తనాల పంపిణీ
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమ్రాబాద్
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అమ్రాబాద్ మండల కేంద్రంలో వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. సహకార సంఘం సభ్యులైన రైతులందరికీ ఉచితంగా విత్తనాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా తదితర సంక్షేమ పథకాలను అన్నదాతలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.