హైవేపై రాస్తారోకో: బస్సులు ఆపడం లేదంటూ ఆందోల్ వద్ద ప్రయాణికుల ధర్నా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Andol

ఆందోల్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులను ఆపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు, విద్యార్థులు, ప్రయాణికులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. బస్సులు ఆపకపోవడంతో పాఠశాలలకు, ఉద్యోగాలకు వెళ్లేవారు గంటల తరబడి వేచి చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఆర్ఎం విజయ్ భాస్కర్, డీఎం పరమేశ్వరి సంఘటన స్థలానికి చేరుకొని అన్ని బస్సులు ఆపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.