అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రెపరెపలాడిన ఎర్రజెండాలు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపాలకు ఘనంగా నివాళులర్పించారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో కొంగర అప్పయ్య స్తూపానికి, రాపల్లి గ్రామంలో నల్లమల్ల సత్యం స్తూపానికి నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు గాంధీ, మండల కార్యదర్శి యెంగల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.