నేర చరిత్ర కలిగిన రౌడీషీటర్లకు శ్రీకాకుళం జిల్లా పోలీసుల కౌన్సిలింగ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీకాకుళం

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని స్పష్టం చేస్తూ శ్రీకాకుళం జిల్లా పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నేర చరిత్ర కలిగిన రౌడీషీటర్లను పిలిపించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలుంటాయని, చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.