ఆలేరు కళాశాలలో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందాలని వక్తలు పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్, డ్రగ్స్, ఎయిడ్స్పై అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఎన్ఎస్ఎస్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.