చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
రిపోర్టర్: నరేష్
స్థలం: చిత్తూరు
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. చిత్తూరు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీసిటీ, సత్యవేడు, తడ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.