ఉత్తరప్రదేశ్‌లో కుస్తీ యోధుడు బ్రహ్మానంద్ దారుణ హత్య
రిపోర్టర్: గోపి
స్థలం: సంత కబీర్ నగర్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత కబీర్ నగర్ జిల్లా ఖలీలాబాద్ పరిధిలోని భగ్తాన్ గోసైన్‌పూర్ గ్రామంలో ముప్పై ఐదేళ్ల కుస్తీ యోధుడు బ్రహ్మానంద్‌ను దుండగులు దారుణంగా హత్య చేశారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఆయన కళ్లలో కారం కొట్టి, కర్రలు మరియు పదునైన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై గ్రామ పంచాయతీ ఎన్నికల కక్షల కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.