హద్దు దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవు: మహేశ్‌కుమార్‌ గౌడ్

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

పార్టీలో క్రమశిక్షణే సర్వోపరి అని, హద్దు దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్ హెచ్చరించారు. కొండా సురేఖ తొలగింపు బాధ కలిగించినా అధిష్టానం ఆదేశాల మేరకే ఆ చర్య చేపట్టామన్నారు. కేసీఆర్ పాలనలో అప్పుల భారమే మిగిలిందని విమర్శించారు. త్వరలో డీసీసీ అధ్యక్షులకు ప్రొటోకాల్ పదవులు ఇస్తామని, ఎన్నికల టికెట్లలో వారిదే కీలక పాత్రని స్పష్టం చేశారు.