సినిమా అప్డేట్: ఆపరేషన్ సిందూర్ చిత్రంలో హీరోగా కార్తీక్ ఆర్యన్

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆపరేషన్ సిందూర్ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటించనున్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టైనీ ధిల్లాన్ రచించిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.