ఆంటోని జోషువాపై బాక్సర్ టైసన్ ఫ్యూరీ తీవ్రస్థాయిలో ఆగ్రహం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: London

బాక్సర్ ఆంటోని జోషువాతో జరగాల్సిన పోరు రద్దు కావడానికి ప్రమోటర్ ఎడ్డీ హెర్న్ అహంకారమే కారణమని హెవీవెయిట్ ఛాంపియన్ టైసన్ ఫ్యూరీ మండిపడ్డారు. డిసెంబర్ 11న కార్డిఫ్లో జరగాల్సిన ఈ చారిత్రాత్మక బాక్సింగ్ మ్యాచ్ను వారు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. యూఎఫ్సీ ప్రెసిడెంట్ దానా వైట్ ప్రమోషన్పై ఎడ్డీ హెర్న్ అభ్యంతరాలు తెలపడంతో వివాదం ములకెత్తిందని టైసన్ ఫ్యూరీ తెలిపారు.